Leading News Portal in Telugu

Sathish Madiga : కాంగ్రెస్ పార్టీ గెలుపే మాదిగల ధ్యేయం



Sathish Madiga

బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చకే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినట్టు సతీష్ మాదిగ తెలిపారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో సతీష్‌ మాదిగ మాట్లాడుతూ తాను బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా పని చేశానని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశానని ఆయన తెలిపారు. ఇటీవల బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక బీజేపీ కి రాజీనామ చేసి కాంగ్రెస్ లో చేరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాదిగ వర్గాలకు మేలు చేస్తా అని మాయమాటలు చెబుతున్నారని, కాకినాడ ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం మాత్రమే చేసింది. కానీ తెలంగాణ ఇవ్వలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద కూడా బీజేపీ అదే విధంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు.

అంతేకాకుండా..’ఎస్సీ,ఎస్టీలకు అన్ని విధాలా అభివృద్ధి కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు వరకు వచ్చింది అంటే.. కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రతేక శ్రద్ధతో అడ్వికేట్ లను పెట్టీ వాదనలను వినిపించారు. మాదిగల ఓటు బ్యాంకు ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. నానే బీజేపీ అచ్చంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎందుకు కృష్ణ మాదిగ ప్రచారానికి రాలేదు..? ఇతర వర్గాలను గెలిపించేందుకు మంద కృష్ణ మాదిగ ప్రచారానికి వెళ్ళారు.. కానీ మాదిగ అభ్యర్థుల ప్రచారానికి లేదు. కులం పేరుతో మాదిగ ఓట్లను దండుకోవలని చూస్తున్నారు. మాదిగల మీద ఓగాల ప్రేమ బీజేపీ చూపిస్తుంది. మాదిగలకు.. మాలలను.. కాంగ్రెస్ ను శత్రువుగా చూపే ప్రయత్నం మంద కృష్ణ మాదిగ చేస్తున్నారు. బీజేపీ కోసం సుధీర్ఘంగా పనిచేసిన బంగారు శృతికి ఎందుకు నాగర్ కర్నూల్ టిక్కెట్ ఇవ్వలేదు. కొత్త గా వచ్చిన సిట్టింగ్ ఎంపి రాములు కుమారుడు భరత్ కు ఎందుకు ఇచ్చారు. కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేసింది అని మంద కృష్ణ మాదిగ ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాదిగలను అనేక ఉన్నత పదవులను కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ గెలుపే మాదిగల ధ్యేయం.’ అని సతీష్‌ వ్యాఖ్యానించారు.