Leading News Portal in Telugu

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాలకు జనసేనాని రూ.10 కోట్ల విరాళం..



Pawan

పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్వహణ కోసం మరోసారి భారీ విరాళాన్ని అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి‌.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు.

CSK vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్..

తన పారితోషికం నుంచి ఎప్పటికప్పుడు పార్టీకే కాకుండా సామాజిక సేవలకు, అధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు విరాళం ఇస్తుంటారు. కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తలా ఓ లక్ష రూపాయలు ఇచ్చారు. ఇక పార్టీ నిర్వహణ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సొంత డబ్బులే పెట్టుకుంటూ వస్తున్నారు. స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారని వారినే తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా పవన్ కల్యాణ్ తెలిపారు.

Snigdha: నన్ను రేప్ చేయబోయారు.. నాన్న మీద కూడా అనుమానమే?

ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లను అందజేస్తున్నానని తెలిపారు. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది.. జనసేన పార్టీ ప్రయాణానికి సగటు కూలి తన చిన్నపాటి సంపాదనలో రూ.వంద పక్కన పెట్టి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. ఓ బెల్దారీ మేస్త్రీ రూ. లక్ష విరాళం అందించారని తెలిపారు. అలాగే పింఛను నుంచి వచ్చే సొమ్ములో కొంత భాగం పార్టీకి తమ వంతుగా పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారన్నారు. వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సాయం అందిస్తున్నారని చెప్పారు. అలాంటి వారి స్ఫూర్తితో తాను సినిమాల ద్వారా వచ్చిన తన కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బును పార్టీ కోసం అందిస్తున్నానని తెలిపారు. ఎన్నికల వేళ ఈ డబ్బు పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.