Leading News Portal in Telugu

Kodali Nani: చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు



Kodali Nani On Cbn

Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడ ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు గాడిది కాళ్లైనా పట్టుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్, హిందూ సోదరులందరికీ తెలుసు.. ఆయన వెనకాల ఉన్న తెలుగు తమ్ముళ్లకు, పదిమంది జనసైనికులకు తప్ప అంటూ విమర్శలు గుప్పించారు. జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరన్నారు. అందితే జుట్టు, లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవనని తెలిసే ఇంటికి వెళ్లి మరి పవన్ కల్యాణ్‌ కాళ్లు పట్టుకున్నాడని ఆయన ఆరోపించారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేసానని ఎంతో బాధపడిన చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలోగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడన్నారు.

Read Also: Volunteers Resignation: రాజమండ్రిలో వాలంటీర్ల సామూహిక రాజీనామాలు..

వాలంటీర్లపై చంద్రబాబు యూటర్న్.. అంతా దొంగ నాటకాలు అంటూ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యానించారు. వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా బ్రహ్మాండంగా పనిచేసిన వ్యవస్థ వాలంటీర్‌ వ్యవస్థ అంటూ ఆయన పేర్కొన్నారు. వాలంటరీ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. చదువుకునీ ఎక్కువ యువతరం ఉన్న వాలంటీర్లకు ఏది మంచో తెలుసు, అదే వాళ్లు ప్రజలకు చెబుతారన్నారు. ఐదేళ్ళుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తు సేవలు అందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారన్నారు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని వాలంటీర్ల జీతాలు పెంచుతామని చంద్రబాబు అంటున్నారని కొడాలి నాని తెలిపారు.

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకొని వారికి జీతాలు ఇస్తాడని ఆయన అన్నారు. ఇప్పుడున్న వారందరిని ఇంటికి పంపి….. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడంటూ ఆరోపణలు చేశారు.