
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో తమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలో.. టీడీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం నిర్వహించారు. విజయవాడ రూరల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.
Pakistan: ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికైన జర్దారీ కుమార్తె అసీఫా
ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. తాము జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసి 4500 మంది కేసులు పెట్టించుకున్నామని పేర్కొన్నారు. తాము జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేస్తే.. తమను ఆయన ఇబ్బంది పెట్టారే తప్పా, తాము జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ రావుకి, ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు సీటు నిరాకరిస్తే ఇండిపెండెంట్ గా ఆదరించింది ఈ గన్నవరం నియోజవర్గం అని తెలిపారు.
Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి భారీ షాక్.. బీజేపీలోకి ముగ్గురు నేతలు..
జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ మద్దతుతో.. బీజేపీ మద్దతుతో గన్నవరం నియోజవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయమని యార్లగడ్డ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. తాను గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడుగా ఎన్నికైన తర్వాత సూపర్ సిక్స్ తాను కూడా అమలు చేస్తానన్నారు. బ్రహ్మ లింగయ్య చెరువుని రిజర్వాయర్ గా మారుస్తా.. ఎయిర్ పోర్ట్ ఎదురుగా 15 ఎకరాల ఎమ్మెన్సీ కంపెనీ తెస్తానని తెలిపారు. అంతేకాకుండా.. రామవరప్పాడు దగ్గర ఒక వంతెన, ఎనికెపాడు దగ్గర ఒక వంతెన నిర్మించి తీరుతా.. 15 వేల నిరుపేదలకు ఇళ్ల పట్టాలిస్తానని చెప్పారు.