Leading News Portal in Telugu

Bride Died: విషాదం.. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి



Bride Died

Bride Died: పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు. వధువు కాళ్ల పారాణి కూడా ఇంకా ఆరలేదు. ఇంతలోనే ఆ వధువును మృత్యువు పగబట్టింది. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దెబ్బగడ్డ గ్రామంలో జరిగింది. వివాహం జరిగిన కొన్ని గంటల వ్యధిలో వధువు అఖిల (20) మృతి చెందగా.. ఆమె మృతితో దెబ్బగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also: Madhya Pradesh: నేను చలాన్ కట్టను, ఎస్పీకి చెప్పండి.. మహిళా ఇన్‌స్పెక్టర్‌తో ఓ వ్యక్తి వాగ్వాదం

పార్వతీపురంకు చెందిన వెత్స అఖిలకు, దెబ్బగడ్డ గ్రామంకు చెందిన భాస్కరరావుకు శుక్రవారం రాత్రి 10 గంటలకు వివాహం జరిగింది. వివాహ అనంతరం నిద్రించిన వధువు అపస్మారక స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులు మక్కువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సలు చేసిన వైద్యులు.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కొరకు సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించమని సూచించారు. కుటుంబ సభ్యులు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించగా.. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మార్గమధ్యలోనే చనిపోయిందని తెలియజేశారు. పోస్టుమార్టం నివేదికలో మరణానికి గల కారణాలు తెలియజేస్తామన్నారు. వధువు మరణంతో ఇరు కుటుంబాలు దుఃఖ సంద్రంలో మునిగిపోయాయి. ఇంట్లో శుభకార్యం జరిగిన కొన్ని గంటల్లోనే ఇలా జరగడంతో కుటుబసభ్యులలో విషాదం అలుముకుంది.