Leading News Portal in Telugu

Congress: ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన.. షర్మిల ఎక్కడ్నుంచంటే..!



Ss

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను వెల్లడించింది. ఏపీలో 114 అసెంబ్లీ అభ్యర్థులతో పాటు 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ వెల్లడించింది. కడప నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల బరిలోకి దిగుతున్నారు. ఇక రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ.శీలం, కర్నూలు నుంచి రామపుల్లయ్య యాదవ్, కాకినాడ నుంచి పల్లంరాజు పోటీ చేస్తున్నారు.

ఏపీలో ఇంకొన్ని స్థానాలను కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టింది. ఇంకా 61 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఫస్ట్ లిస్టులోనే షర్మిల పేరు ప్రకటించారు. ఇక పిఠాపురంలో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సత్యానందరావు బరిలోకి దిగుతున్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పవన్‌కల్యాణ్ పోటీలో ఉన్నారు. అధికార వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఇప్పుడు మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఇక ఒడిశాలో కూడా 49 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించింది. ఏపీ, ఒడిశాలో రెండు చోట్ల ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభమవుతోంది. ఇక చివరి విడత జూన్ 1న జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Cong

 

Kd

Ka 2

O 1

O 2