Leading News Portal in Telugu

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో విషాదం.. పెన్షన్‌ కోసం వెళ్తూ వృద్ధురాలి మృతి



Sunstroke

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల కష్టాలు అంతా ఇంతా కాకుండా పోయాయి.. ప్రతీ నెల 1వ తేదీన ఇంటి ముందుకే పెన్షన్‌ వచ్చేది.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. సచివాలయం దగ్గరకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి.. అయితే, ఇది కొందరి ప్రాణాలు మీదకు తెస్తోంది.. కృష్ణా జిల్లా గంగూరులో విషాదం నెలకొంది.. అసలే ఎండలు మండిపోతున్నాయి.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఈ సమయంలో పెన్షన్‌ కోసం వెళ్తూ వడదెబ్బ తగిలి వృద్ధురాలి మృతి చెందింది.. పెన్షన్ కోసం వెళ్తుండగా వడదెబ్బతో 80 ఏళ్ల వజ్రమ్మ కుప్పకూలిపోయింది.. ఉదయం నుంచి పెన్షన్‌ కోసం ఆమె పడిగాపులు కాసిందనే.. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగిలి వజ్రమ్మ మృతిచెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Read Also: Ramayan : రణబీర్ రామాయణం మొదలైంది.. రంగంలోకి గురూజీ!

కాగా, ఏపీ ఉదయం నుంచే పెన్షనర్లు సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు.. ప్రతీనెల 1వ తారీఖున ఉదయాన్నే ఇంటికే వచ్చే పెన్షన్ కాస్తా ఇప్పుడు మరల సచివాలయాల వద్దకు వెళ్లి తీసుకోవాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు.. పెన్షన్ల కోసం సచివాలయాలకు వెళుతున్నారు.. అయితే, సచివాలయాల వద్ద గతంలో ఒకరోజు ముందే పెన్షన్ సొమ్ము డ్రా చేసి పెట్టుకునే అలవాటు ఉండేది.. ఇప్పుడు పెన్షన్ పంపిణీ అంశంలో నిన్న సాయంత్రం వరకూ సందిగ్ధత నెలకొనడంతో.. సచివాలయ అసిస్టెంట్లు సైతం బ్యాంకుల వద్దకు ఇవాళే వెళ్ళడంతో.. సచివాలయాల వద్ద పెన్షన్ కోసం పింఛనుదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.