Leading News Portal in Telugu

CM YS Jagan: జన నేతకు ఘన స్వాగతం.. 14 భారీ క్రేన్‌లతో ఇలా..



Ys Jagan

CM YS Jagan: ఎన్నికల తరుణంలో రాష్ట్రాన్ని చుట్టేసేపనిలో పడిపోయారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించి.. వైసీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసిన ఆయన.. ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు.. ఈ సందర్భంగా ప్రజలతో మమేకం అవుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.. తమ ప్రభుత్వ హయాంలో అందిన సంక్షేమ పథకాలపై ఆరా తీస్తున్నారు.. మీ బిడ్డ ప్రభుత్వంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచి జరిగిందంటేనే మళ్లీ ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు.. జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది..

Read Also: Adhurs Sequel: NTR ఇంటి ముందు నిరాహార దీక్ష చేసయినా సరే Adhurs 2 చేయిస్తా!

ఇక, ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా సీఎం వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం లభిస్తోంది.. గజమాలతో స్వాగతం పలుకుతున్నారు.. మంగళహారతులు ఇస్తున్నారు.. వీర తిలకం దిద్దుతున్నారు.. సభలు, సమావేశాలు, ముఖాముఖీలు ఇలా ముందుకు సాగుతోన్న వైసీపీ అధినేతకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది.. ఇక, ఈ రోజు తిరుపతి జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర కొనసాగుతుండగా.. దామలచెరువు దగ్గర గ్రాండ్‌ వెల్కమ్ చెప్పాయి వైసీపీ శ్రేణులు.. అటు ఏడు.. ఇటు ఏడు.. మొత్తం 14 భారీ క్రేన్‌లు ఉంచి.. వాటికి వైసీపీ జెండా కలర్‌లో భారీ పూలమాలలు ఉంచి స్వాగతం పలికారు.. అవి బస్సులో నుంచి తిలకించిన సీఎం వైఎస్ జగన్‌.. వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.