Leading News Portal in Telugu

Yarlagadda Venkat Rao: గన్నవరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలబెడుతా..



Yarlagadda Venkat Rao

Yarlagadda Venkat Rao: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు ప్రజాగళం పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రామవరప్పాడు గ్రామంలోని నెహ్రూనగర్, హనుమాన్ నగర్ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు 20 వేల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్‌గా మార్చి తాగు, సాగు నీటి కష్టాలు తీర్చుతానని హామీ ఇచ్చారు. అర్హులైన పేదలకు 15 వేల ఇళ్ల పట్టాలు అందజేస్తానన్నారు. నియోజకవర్గంలో అవినీతి లేకుండా చేస్తానని చెప్పారు. గతంలో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్‌గా పని చేసినప్పుడు కేడీసీసీ బ్యాంకును దేశంలోనే మొదటి స్థానంలోనే నిలిపానని, అనేక మంది యువతకు బ్యాంకు ఉద్యోగాలు, వాలంటీర్ పోస్టులు ఇచ్చానని గుర్తు చేశారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తానని, వంతెనలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Read Also: Justice NV Ramana: ఆర్థిక పరిస్థితిని గమనించి ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి..

టీడీపీలో చేరికలు
ప్రచారం అనంతరం గ్రామానికి చెందిన సతీష్, మెరుగు సుధాకర్, లక్ష్మణరావు తెలుగుదేశం పార్టీలో చేరగా.. యార్లగడ్డ వారికి కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు నభిగారి కొండ, కార్యదర్శి ఎం. సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గొడ్డళ్ల రామారావు, గన్నవరం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు అద్దేపల్లి సాంబ, బచ్చుల బోసుబాబు, గూడవల్లి నర్సయ్య, సర్నాల బాలాజీ, దొంతు చిన్న, గుజ్జర్లపూడి బాబూరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు దండి సుబ్రహ్మణ్యరాజు, కొల్ల అనంద్ కుమార్, పట్టపు చంటి, పుట్టి నాగరాజు, బొమ్మసారి అరుణ కుమారి, తుపాకుల శివలీల, రాజులపాటి సాంబశివరాజు, కొంగని రవి కుమార్, కల్లెపల్లి సాయిరామరాజు, దూళిపూడి దుర్గాప్రసాద్, విజ్జి రాము, కల్లెపల్లి రామ కృష్ణంరాజు, పరుచూరి నరేష్, బొప్పన హరికృష్ణ, జనసేన నాయకులు బండ్రెడ్డి రవి, అడ్డగిరి రామకృష్ణ, పొదిలి దుర్గారావు, గోవర్ధన్, కాట్రగడ్డ రాంబాబు, కూనపరెడ్డి నాని, హరి, పోలిశెట్టి పవన్, పట్ట పవన్, స్వాతి, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి డా. ఫణి కుమార్, మల్లిఖార్జున రాజు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.