
పెన్షన్లు పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను ఎండలో నిలబెట్టారు.. ఇక, వాలంటీర్ల వ్యవస్థే లేదంట అనే వార్త బయటకు వచ్చింది.. వాలంటీర్ల వ్యవస్ఖను రద్దు చేస్తూ రహస్య జీవో ఏమైనా తెచ్చారా..? అని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థపై తొలి సంతకం అంటే.. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్ఖ లేనట్టేగా..? అని పేర్కొన్నారు. సీఎం జగన్ వాలంటీర్లను మోసం చేస్తున్నారు.. జగన్ ఎంత స్వార్ధపరుడో వాలంటీర్లు అర్ధం చేసుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం.. వారికి 10 వేల రూపాయల గౌరవ భృతిని కల్పిస్తాం అని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Chiranjeevi and Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవిపై రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు..
ఇదే కాకుండా వాలంటీర్లల్లో చదువుకున్న వారికి అద్భుతమైన ఉపాధి కల్పిస్తాం అని చంద్రబాబు నాయుడు అన్నారు. తప్పుడు పనులు చేసిన వాలంటీర్లు జైలుకు వెళ్లొద్దు.. రాష్ట్ర ప్రగతితో వాలంటీర్లు భాగస్వామి కావాలి అని చెప్పారు. జగన్ వచ్చేది లేదు.. చచ్చేది లేదు.. వాలంటీర్ల వ్యవస్థపై జగన్ సంతకం చేసేది లేదు.. తన సొమ్మును పేదలకు ఇస్తున్నట్టు జగన్ ఏదేదో చెబుతున్నాడు.. ప్రజలు వేసిన పన్నులను అంతంత మాత్రంగా ఇస్తూ ఫోజులు కొడుతున్నారు అని ఆయన విమర్శలు గుప్పించారు. మన మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి డిపాజిట్లు రావు.. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం అని తెలిపారు. వృద్ధులకు పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టిన పార్టీనే టీడీపీనే అని నారా చంద్రబాబు చెప్పుకొచ్చారు.