Leading News Portal in Telugu

Karumuri Nageswara Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో ప్రజలు లేరు..



Karumuri Nageshwar Rao

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలు లేరు గళం మాత్రం ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. నేను పెద్ద ముదురు అని చంద్రబాబు అంటున్నారు.. చంద్రబాబు కంటే ప్రజలకు మేలు చేయడంలో.. రైతులకు మేలు చేయడంలో నేను ముదురన్నారు. నాకు రెండు స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నట్టు నిరూపిస్తే నేను నా కుమారుడు రాజకీయాలను వదిలేస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీఎస్ బాండ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. తణుకు నరేంద్ర సెంటర్లో చర్చకి రెడీ హా అని సవాల్ విసిరారు. బీసీలకు పదవులు ఇస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక తల ఎక్కడ పెట్టుకోవాలి అనేది అర్దం కాడం లేదు.. పవన్ తన వాళ్ళకి సీట్లు ఇచ్చుకోలేక పోయారు. నువ్వా మాట్లాడేది హా అంటూ సెటైర్ వేశారు. నా నాయకుడు నిప్పు.. మీరు ఏమి చేయలేరు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

Read Also: Kakarla Suresh: కాకర్ల సురేష్కి అడుగడుగునా నీరాజనాలు పలికిన ప్రజలు..

చంద్రబాబునీ ముదురుతనం వేరు.. నా ముదురు తనం వేరు అని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్లో చంద్రబాబు జేబులు కొట్టేవాడివని నాదెండ్ల భాస్కర్ ఎప్పటినుంచో చెప్తున్నారు.. కాంగ్రెస్ లో చేరి ఆ తర్వాత టీడీపీలో ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచావు.. దమ్ము ధైర్యం ఉంటే స్టే లాన్ని ఎత్తేసి నీ నిజాయితీ నిరూపించుకో అని సవాల్ విసిరారు. రాజకీయ వ్యాబిచారుల్లో చంద్రబాబు నెంబర్ వన్.. దోచుకోడం, దాచుకోడానికి మళ్ళీ చంద్రబాబు ఉవ్విళ్ళు ఊరుతున్నారు ఆయన ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిని పాతాళనికి తొక్కేస్తా అన్న పవన్ చీమను కూడా తొక్కలేరు.. టీడీఎస్ బాండ్ల విషయంలో చర్చకు వస్తే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే చెప్పుతో కొడతారు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు.