Leading News Portal in Telugu

Memantha Siddham Bus Yatra: 13వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్‌ ఇదే..



Jagan

Memantha Siddham Bus Yatra: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. మండుటెండను లెక్క చేయకుండా జగన్ ముందుకు కదులుతున్నారు. ఆయన్ను చూసేందుకు జనం పెద్దయెత్తన రోడ్లపైకి వస్తూ ఎదురుచూస్తున్నారు. ఇవాళ 13వ రోజు గుంటూరు జిల్లా ధూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభవుతోంది. రంజాన్ తో నిన్న ఒకరోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. 12వ రోజు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి బయలుదేరి బస్సు యాత్ర పిడుగురాళ్ల వరకు అక్కడ నుంచి ధూళిపాళ్ల వరకు కొనసాగింది. అక్కడే జగన్ బస చేశారు సీఎం జగన్‌.

Read Also: Janata Bar Movie: హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రాయ్ లక్ష్మీ.. హీరో ఎవరంటే?

ఇక, ఈ రోజు ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల బస నుంచి సీఎం వైఎస్‌ జగన్ బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సభ తర్వాత తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్‌ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా యాత్ర సాగుతుంది. నంబూరు బైపాస్ దగ్గర బస చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.