Leading News Portal in Telugu

YS Bharathi Reddy: రంగంలోకి దిగన వైఎస్ భారతి.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం..!



Whatsapp Image 2024 04 12 At 6.50.50 Pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎలాగైనా అధికారంలో రావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనే నినాదంతో దూసుకెళ్తున్నాడు. ఈ సమయంలో ఆయన భార్య కూడా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఇకపోతే ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25న పులివెందుల సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నాడు. ఇందుకు గాను పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం బాధ్యతలను జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి తన భుజాన వేసుకున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలలో పాల్గొనాల్సిన నేపథ్యంలో తన సతీమణి ఇప్పుడు పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు.

Also read: Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై పోలీస్ కేసు.. కారణం ఇదే..

ఇందులో భాగంగా ఎన్నికలకు పూర్తయ్యేంతవరకు వైయస్ భారతి పులివెందులలోనే ఉండి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బయట ఎలాంటి వివాదాలకు కలుగ చేసుకోకుండా.. వాటికి దూరంగా ఉంటూ ఉండే వ్యక్తిగా వైఎస్ భారతికి మంచి పేరుంది. అచ్చం కడప యాసలో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసిపోయే స్వభావం ఉన్న భారతి పట్ల పులివెంద ల ప్రజలకి మంచి ఆదరణ ఉంది.

Also read: LSG vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో..

దాంతో ఎలాగైనా గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని ఉద్దేశంతోనే భారతి ప్రచారానికి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే వైయస్ భారతి తండ్రి దివంగత ఈసి గంగిరెడ్డికి పులివెందులలో మంచి పేరు ఉంది. ఎన్నికల నేపథ్యంలో అనేకసార్లు జగన్ కోసం భారతి ఎన్నికల ప్రచారాన్ని చేశారు. భర్త లక్ష సాధన కోసం తాజాగా వైఎస్ భారతి రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది.