Leading News Portal in Telugu

Nallapareddy: నమ్ముకున్న వారిని మోసం చేయడమే చంద్రబాబు నైజం



Nallapureddy

నెల్లూరు జిల్లాను నల్లపరెడ్డి కుటుంబం ఎంత అభివృద్ధి చేసిందో ప్రజలందరికీ తెలుసు అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. కోవూరులో మా నాన్న శ్రీనివాసులు రెడ్డిని మూడుసార్లు, మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డిని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.. నెల్లూరు జిల్లాకు తెలుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చిన ఘనత మా తండ్రిదే.. మహిళలంటే మాకు చాలా గౌరవం.. నమ్ముకున్న వారిని మోసం చేయడం చంద్రబాబు నైజం అని ఆయన ఆరోపించారు. కోవూరులో మూడు సంవత్సరాల పాటు దినేష్ రెడ్డిని తిప్పారు.. టికెట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.. చివరకు మొండి చేయి చూపి ప్రశాంతి రెడ్డికి టికెట్ ఇచ్చారు.. వెంకటగిరిలో కూడా నన్ను ఇదేవిధంగా చంద్రబాబు మోసం చేశారు.. అప్పట్లో నాకు టికెట్ ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో సినీ నటి శారదను రంగంలోకి దించారు అని రాజేంద్ర కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Bihar: చెప్పుడు మాటలు విని కన్న కూతురిని హత్య చేసిన తండ్రి..

నల్లపరెడ్డి కుటుంబం చేసిన అభివృద్ధి ఏమిటో ప్రశాంతి రెడ్డి తెలుసుకోవాలి అని రాజేంద్ర కుమార్ రెడ్డి చెప్పారు. ప్రజలు అన్నీ ఆలోచించి ఈసారి ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. మరోసారి కోవూరులో మా అన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం సాధిస్తాడు అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయడమే మాకు తెలుసు.. అలాంటిది మాపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు లాగా తప్పుడు పనులు చేసే వ్యక్తులం తాము కాదన్నారు. రాష్ట్రంలో మరోసారి సీఎం జగన్ పరిపాలనలో పరుగులు పెట్టిస్తారని చెప్పారు. ఈసారి 175 కి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టిస్తుందని నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు.