
Election Commission: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి.. ఏపీలోని రాజకీయ పార్టీల అధినేతలు.. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇదే సమయంలో.. ఆరోపణలు, విమర్శలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు ఇలా ముందుకు సాగుతున్నారు.. ఇక, ప్రచారసభల్లో చంద్రబాబు పదేపదే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ముఖ్యంగా మచిలీపట్నం ఎన్నికల సభలో సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.. వారి వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ నేతలు. కాగా, ఎన్నికల తరుణంలో నేతల వ్యాఖ్యలపై ఇటు టీడీపీ, అటు వైసీపీ పరస్పరం ఈసీకి ఫిర్యాదులు చేస్తున్న విషయం విదితమే.
Read Also: PBKS vs MI: ముంబై ఇండియన్స్ భారీ స్కోర్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..?
ఇక, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారంటూ ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిపై టీడీపీ చేసిన ఫిర్యాదుతో వెంకటరామిరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే.. బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై.. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారంటూ వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదులు వెళ్లాయి.. దీంతో, చర్యలకు దిగింది ప్రభుత్వం.. వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేసిన సర్కార్.. హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డిపై చర్యలు తీసుకుంది..