
Road Accident: నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Read Also: Fire Accident : బీహార్‌లో ఘోర ప్రమాదం, గ్యాస్ సిలిండర్ పేలి చిన్నారి సహా 8 మంది మృతి