Leading News Portal in Telugu

Telangana and Andhra Pradesh: నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ.. 3 గంటల వరకే డెడ్‌లైన్



Nomination

Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.. ఈ రోజు మధ్యాహ్నం లోపు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటి వరకు మొత్తం 478 మంది అభ్యర్థులు, 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.. ఇక, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా జరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆ స్థానంలో 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు డెడ్‌లైన్‌ ఉండగా.. రేపు నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది.. ఇక, మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి..

Read Also: Mumbai: 40 అడుగుల లోతున్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు కూలీలు మృతి

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవాళ్టితో ముగియనుంది నామినేషన్ల స్వీకరణ.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటివరకు అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 654 నామినేషన్లు దాఖలు అయ్యాయి.. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు కావడం విశేషం.. ఇక, ఇవాళ్టితో నామినేషన్ల స్వీకరణ ముగియనుండడంతో.. ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు.. మరికొందరు కీలక అభ్యర్థులు ఈ రోజు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.