Leading News Portal in Telugu

CM YS Jagan: ఏపీలో హీరో ఎవరో.. విలన్‌ ఎవరో.. ప్రజలు తెలుసుకోవాలి..



Cm Ys Jagan

CM YS Jagan: మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. పేదలకు, మోసకారి చంద్రబాబుకు మధ్య పోటీ అని సీఎం జగన్‌ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్నారు. చంద్రముఖి మీ ఇంటి తలుపు తట్టి 5 ఏళ్లు మీ రక్తం పీల్చేస్తారని.. ఒకే ఒక్కడిని ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. కూటమి అభ్యర్థులు మీ ఇంటికి వచ్చినప్పుడు జగన్ ఎందుకు ఓడించాలి ప్రశ్నించాలని ఆయన ప్రజలను కోరారు. సంక్షేమ పాలన అందిస్తున్నందుకా, గతంలో ఎవరు ఇవ్వలేని విధంగా అవినీతికి త్రోవ లేకుండా సంక్షేమ పథకాలు అందించినందుకా అని ప్రశ్నించాలన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆలోచన చేసి ఓటెయ్యాలన్నారు. కేజీ బంగారం ఇస్తానని చెబితే తీసుకోండి కానీ మీ ఇంటిలో మంచి జరిగితే ఫ్యాన్‌కు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో రియల్ హీరో ఎవరో విలన్ ఎవరో మీరే తెలుసుకుని ఓటు వేయాలని.. అంబాజీపేట బహిరంగ సభలో సీఎం జగన్ అభ్యర్థించారు.

Read Also: TDP-BJP-Janasena Manifesto: రేపే టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో..

వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికి రావాలన్నా పేదోడి భవిష్యత్తు మారాలన్న పథకాలు నీకు కొనసాగాలన్నా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలన్నారు. మీ జగన్ కి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు… పొరపాటున చంద్రబాబు ఓటేస్తే పదకాల నీ ముగింపు మళ్లీ మోసపోవడమని విమర్శించారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందన్నారు. చంద్రబాబును కూటమిని ఒకటే అడుగుతున్నా… జగన్ ఎందుకు ఓడించాలని..? ఈ పథకాలన్నీ రద్దు చేయాలనా? అని ప్రశ్నించారు. 58 ఎనిమిది నెలల కాలంలో 66 లక్షల మందికి పెన్షన్లు…. అవ్వ తాతలకు ప్రతి ఒక్కరికి కూడా వేల రూపాయలు పెన్షన్ ఇంటికి పంపించినందుకా….. జగన్‌ను ఓడించాలా అని అడుగుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా 55 లక్షల మంది రైతన్నలకు రైతు భరోసా ఇచ్చినందుకు జగన్ని ఓడించాలా అని అడుగుతున్నానన్నారు.