Leading News Portal in Telugu

YS Avinash Reddy: పెన్షన్ల పంపిణీపై వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..



Mp Ys Avinash Reddy

YS Avinash Reddy: ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో పెన్షన్ల వ్యవహారం కాకరేపుతూనే ఉంది.. గత నెలలో పెన్షన్ల పంపిణీ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇక, పెన్షన్ల పంపిణీ పై ఘాటుగా స్పందించారు కడప ఎంపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి.. పెన్షన్ల పంపిణీలో జరిగిన ఘోరానికి చంద్రబాబు నాయుడే కారణమన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అవ్వాతాతలు గుణపాఠం చెబుతారు అని హెచ్చరించారు. చంద్రబాబు తప్పుడు పని వల్ల నేడు అవ్వ , తాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. ఎండలకు తట్టుకోలేక చాలామంది వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొందరు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: #ARRPD6 : క్రేజీ మూవీ షూటింగ్ షురూ..

వాలంటీర్‌ వ్యవస్థను సస్పెన్షన్ చేసినారు కాబట్టి డబ్బులను బ్యాంకుల్లో జమ చేశారు.. బ్యాంకుల వద్దకు వెళ్లి అవ్వాతాతలు వేచి ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అవినాష్‌రెడ్డి.. చంద్రబాబు నాయుడు వల్లే ఈ రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. గత రెండు నెలలుగా పెన్షన్ ఇబ్బందులు కలగడానికి కారకుడు చంద్రబాబే అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారు.. చంద్రబాబు అధికారంలోకి వస్తే తిరిగి తమ ఒక పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారని పసిగట్టారని వ్యాఖ్యానించారు. ఇక, 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది.. అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ అంటూ రైతులను నట్టేట ముంచాడు చంద్రబాబు.. డ్వాక్రా రుణాల పేరుతో మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే.. ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో నేడు ప్రజలు లేరన్నారు. ఆయన మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని స్పష్టం చేశారు కడప వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి.