Leading News Portal in Telugu

Botsa Satyanarayana: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం తగదు



Botsa Satyanarayana 10

ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి, వైసీపీ నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రాష్ట్రంలో చర్చ కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ ఈ యాక్ట్ పై పలు ఆరోపణలు చేస్తున్నారు.

READ MORE: Chandrababu: 2047 వరకు భారత్‌ను నెంబర్‌వన్‌గా చేయాలనేది మోడీ సంకల్పం

దీనికి స్పందించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజల భూములను జగన్ లాగేసుకుంటాడని పవన్ కల్యాణ్ ఊగిపోతూ మాట్లాడుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ కి అసలు ఏమీ తెలుసు, అన్నం తిన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా.? అని ప్రశ్నించారు. ఎవడి భూమి ఎవడు లాక్కుంటారన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం ప్రజల భూములను లాక్కుంటుందా అని అడిగారు. రాజకీయ లబ్ధి కోసం క్రిమినల్ మైండ్ తో చంద్రబాబు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గెలవడానికి చంద్రబాబు ఎంత నీచానికైన దిగజారుతారని మండిపడ్డారు. ఈ యాక్ట్ వల్ల తగాదాలు లేని భూ హక్కు యజమానులకు దక్కుతుందన్నారు. జగన్ ప్రజలకి ఎప్పుడూ మంచే చేస్తారు.. కానీ మోసం చెయ్యరని స్పష్టం చేశారు.