Leading News Portal in Telugu

Sajjala Ramakrishna Reddy: ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలు



Sajjala

Sajjala Ramakrishna Reddy: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ముస్లిం మైనారిటీ జేఏసీ నేతలు కలిశారు. ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డితో జేఏసీ నేతలు చర్చించారు. ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారు ముస్లిం రిజర్వేషన్లపై వైసీపి వైఖరిని వారు మెచ్చుకున్నారని ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారన్నారు.

Read Also: CM YS Jagan: 14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చిందన్నారు. దేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని.. ఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చామన్నారు. రాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందని.. చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలన్నారు. దీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలన్నారు. వైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్ అని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.