Leading News Portal in Telugu

AP Elections 2024: హైదరాబాద్‌ నుంచి ఏపీకి భారీగా నగదు తరలింపు.. రూ.8.39 కోట్లు సీజ్‌



Cash

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.. హైవేలు, ఇతర రోడ్లు అనే తేడా లేకుండా చెక్‌పోస్టులు పెట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు.. ఇలా ఇప్పటికే కోట్లాది రూపాయలు పోలీసుల తనిఖీల్లో సీజ్‌ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు వద్ద.. తాజాగా భారీగా నగదు సీజ్‌ చేశారు.. హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో భారీగా క్యాష్ తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.. దీంతో.. తనిఖీలు విస్తృతంగా చేశారు.. ఆ తనిఖీల్లో ఓ లారీలో తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు.. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకొని విచారణ జరుగుతున్నారు. ఈ క్యాష్ ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరి కోసం తీసుకెళ్తున్నారు.. ఎవరు ఇచ్చారు? లాంటి విషయాలపై కూపీలాగుతున్నారు.

Read Also: Pakistan : పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ.. 25 మందికి పైగా గాయాలు