
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమయం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం చివరి దశకు చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాలు జోరుగా సాగిస్తున్నాయి. గెలుపు కోసం ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇకపోతే ఈసారి రాష్ట్రంలో చాలాచోట్ల ప్రజల చూపు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వైపే అందరి దృష్టి నెలకొంది. దీనికి కారణం ఈసారి ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుండి గెలుస్తారా అని రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.
Also read: PM Modi: నేను నిమిత్తమాత్రుడ్ని.. ప్రజలే ఈశ్వరస్వరూపులు
ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఒక్కొక్కరుగా సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం క్యాంపెయిన్ నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చింది. అందిన సమాచారం వరకు.. బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం అబ్బాయి రామ్ చరణ్ పిఠాపురం వెళుతున్నాడట. దీంతో మరోసారి పిఠాపురం నియోజకవర్గం పై ప్రజల దృష్టి పడింది.
Also read: CSK vs GT: సెంచరీలతో చెలరేగిన గిల్, సుదర్శన్.. గుజరాత్ భారీ స్కోరు
ఇకపోతే రామ్ చరణ్ పిఠాపురం వెళుతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా., నిజానికి రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వెళుతున్నట్లు సమాచారం. ఎలాగూ అంత దూరం వెళ్లిన అతను తన బాబాయ్ కోసం ప్రచారం కూడా నిర్వహిస్తాడంటూ రాజకీయాల వర్గాల నుండి సమాచారం అందుతుంది.