Leading News Portal in Telugu

Allu Arjun At Nandyal: నంద్యాలలో అల్లు అర్జున్ సందడి.. ఇదేం క్రేజ్‌ మామ..!


Allu Arjun At Nandyal: నంద్యాలలో అల్లు అర్జున్ సందడి.. ఇదేం క్రేజ్‌ మామ..!

Allu Arjun At Nandyal: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశారు.. నంద్యాల చేరుకున్న అల్లు అర్జున్ ను చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఫ్యాన్స్‌.. ఎటు చూసినా జనమే అన్న చందంగా మారిపోయింది నంద్యాల.. ఇక, గజమాల తో పుష్పకు ఘనంగా స్వాగతం పలికారు అభిమానులు.. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్వా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ రెడ్డికి పూలమాలలతో స్వాగతం పలికారు శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు.. అల్లు అర్జున్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో.. శిల్పా రవి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.. అసలు, ఫ్యాన్స్‌ను ఛేదించుకుంటూ.. తన మిత్రుడి ఇంట్లో అడుగు పెట్టేందుకు బన్నీ చాలా కష్టపడాల్సి వచ్చింది.. ఇక, శిల్పా రవి ఇంటి బాల్కనీ నుంచి తన ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు ఐకాన్‌ స్టార్‌.


కాగా, గత ఎన్నికల్లో తొలిసారి నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి బరిలోకి దిగారు.. ఆ సమయంలో కూడా బన్ని తన మిత్రుడికి మద్దతుగా నిలిచారు.. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు శిల్పా రవి.. ఎన్నికల సమయం కావడంతో.. మళ్లీ ఇప్పుడు కూడా శిల్పా రవి.. నంద్యాలలో తన భార్యతో కలిసి సందడి చేశారు.. తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు. మొత్తంగా రాజకీయాలు వేరు.. తమ స్నేహం వేరంటూ.. ప్రచారానికి తెరపడనున్న రోజు.. నంద్యాలలో సందడి చేశారు అల్లు అర్జున్‌. ఓవైపు బన్నీ ఫ్యాన్స్‌, మరోవైపు వైసీపీ శ్రేణులతో నంద్యాల కిక్కిరిసిపోయింది. మరోవైపు.. #AlluArjunAtNandyal అపూ యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ మారింది.. తమ అభిమాన నటుడి నంద్యాలలో అడుగుపెట్టిన వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌.