Leading News Portal in Telugu

Allu Arjun : అందుకే వైసీపీ అభ్యర్ధికి మద్దతు.. ఆ విషయంలో సంబంధం లేదు.!


Allu Arjun : అందుకే వైసీపీ అభ్యర్ధికి మద్దతు.. ఆ విషయంలో సంబంధం లేదు.!

Allu Arjun Supports YCP MLA Shilpa Ravichandra Reddy: నంద్యాల YCP MLA అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని అల్లు అర్జున్ చెప్పారు. ‘రవి పాలిటిక్స్ లోకి రాకముందు వారానికోసారి కలిసే వాళ్లం కానీ ఐదేళ్లుగా ఆరు నెలలకోసారే కలుస్తున్నాం. ఇక్కడే తెలుస్తోంది కదా అతను ఎంత కష్టపడుతున్నాడో, ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి ఇక్కడకు వచ్చా, ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భవిష్యత్తులో మరిన్ని మెట్లు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నా’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇక ఎప్పుడు కలిసినా నంద్యాల గురించే రవి చెప్తూ ఉంటారని అన్నారు.


Kajal Aggarwal : ఆ సమయంలో కాజల్ అన్న మాటకు షాక్ అయిన దర్శకుడు తేజ..?

ఇక ఐదేళ్ళలో రవి మంచి అభివృద్ధి చేశారని పేర్కొన్న అల్లు అర్జున్ నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని అన్నారు. ఇక నా స్నేహితులు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా వాళ్ళ కోసం వెళ్తానని ఆయన అన్నారు. ఇక మీకు గుర్తు ఉండి ఉంటె శిల్పారవి 2019 లో పోటీ చేసినప్పుడు మెసేజ్ మాత్రమే పంపానని, ఇప్పుడు డైరెక్ట్ గా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని అన్నారు. రవి మంచి మెజారిటీతో గెలుస్తారనే నమ్మకం నాకుందని అల్లు అర్జున్ కామెంట్ చేశారు. అయితే అల్లు అర్జున్ ఇలా నంద్యాల వెళ్లడంతో సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గెలవాలని ఆకాంక్షించిన అల్లు అర్జున్ ఇప్పుడు వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం చర్చనీయాంశం అయింది.