Leading News Portal in Telugu

Allu Arjun: నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ కి పోలీసుల షాక్.. కేసు నమోదు?


Allu Arjun: నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ కి పోలీసుల షాక్.. కేసు నమోదు?

Case Filed on Allu Arjun for Nandyala Visit: గత కొన్నాళ్లుగా ఆసక్తికరంగా జరుగుతూ వచ్చిన ఏపీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మే 13వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కూడా జరగబోతోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఉన్న స్థానికేతరులు ఇతర నాయకులు నియోజకవర్గాలను విడిచి వెళ్ళిపోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. అయితే చివరి రోజున తనకు స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో కలిసి వెళ్లారు. తనకు రవిచంద్ర రెడ్డి ముందు నుంచే పరిచయమని గతంలో ఎన్నో సార్లు కలుస్తూ ఉండే వాళ్ళం కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే కలుస్తున్నాడని కష్టపడి పని చేస్తున్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? ఏమిటి? అంటూ అల్లు అర్జున్ తన స్నేహితుడిని గెలిపించమని కోరారు.


VD 14: ఇదెక్కడి మాస్ మావా.. ఏం ప్లాన్ చేశారు?

అయితే అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ దంపతులు వచ్చిన సమయంలో భారీగా జన సందోహం అల్లు అర్జున్ ని చూసేందుకు కదలి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. అయితే తమ అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది.