Leading News Portal in Telugu

Perni Nani: అన్ని వర్గాల వారు జగన్కు అండగా ఉన్నారు..


Perni Nani: అన్ని వర్గాల వారు జగన్కు అండగా ఉన్నారు..

అన్ని వర్గాల వారు సీఎం జగన్కు అండగా ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కాపు సామాజిక వర్గంను మోసం చేశారని.. కాపులను బీసీ చేస్తానని చేయలేదని ఆరోపించారు. కాపులకు ఏం చేస్తానో చెప్పి.. చేసి చూపించిన వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. దళితులను జగన్ కు దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని పేర్ని నాని మండిపడ్డారు. బీసీలు కూడా చంద్రబాబు తమను వాడుకుని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది వైఎస్ జగన్.. ఇది వాళ్లకు కూడా తెలుసని తెలిపారు. మహిళలను కూడా చంద్రబాబు మోసం చేశారని.. ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. మహిళ లోకం ఇవాళ జగన్ కు అండగా ఉందని పేర్కొన్నారు.


Solar Storm: భూమిని తాకిన శక్తివంతమైన “సౌర తుఫాను”.. కమ్యూనికేషన్, పవర్ గ్రిడ్‌లకు అంతరాయం..!

కొవిడ్ సమయంలో వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుందని పేర్ని నాని తెలిపారు. వాలంటరీలు కొవిడ్ సమయంలో ఎలా సాయం చేశారో ప్రజలు గుర్తు తెచ్చుకోండని అన్నారు. మరోవైపు.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై టీడీపీ పుకార్లు షికార్లు చేయిస్తున్నదని మండిపడ్డారు. 2019లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆస్తి పత్రాలు వాళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాయి ? అని ప్రశ్నించారు. ఎవరు ఆస్తులు కొనుక్కుంటే… వాళ్ళ దగ్గర ఆస్తుల పత్రాలు ఉన్నాయని తెలిపారు. ల్యాండ్ ఎన్నికల కమిషన్ ఏం చేసుకుంటావో చేసుకో అని.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై టీడీపీ ప్రకటనలు ఇచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చిన కండకావరంతోనే టీడిపి ఇదంతా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ఎందుకు కొరడా జూలిపించడం లేదని మండిపడ్డారు.

IPL 2024: రికార్డ్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17వ సీజ‌న్‌..

మరోవైపు.. గతంలో వాలంటరీ వ్యవస్థను తప్పుపట్టిన టీడీపీ.. ఇప్పుడు కొనసాగిస్తుమని చెబుతుందని పేర్ని నాని తెలిపారు. ల్యాండ్ టైటిల్ చట్టంలో లేని అంశాలను ప్రచారం చేస్తున్నది టీడీపీనేనని పేర్కొ్న్నారు. రాజకీయంగా జగన్ ఎదుర్కోలేక.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై దుర్మార్గంగా టీడీపీ ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. అయిదేళ్లుగా మీ ఆస్తులపై లోన్ లు తెచ్చుకుంటున్నారు కదా ? జగన్ ఎలా తనఖా పెడతారు ?అని ప్రశ్నించారు. ఒకే ఆస్తికి బ్యాంకు రెండు లోన్లు ఇస్తాయా ? ప్రజలు ఆలోచించాలన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసం ఆరు వేల గ్రామాల్లో సర్వే జరిగింది.. ఆ గ్రామాల్లో ఆస్తులకు ఏమైనా ఇబ్బంది అయ్యిందా ? అని పేర్ని నాని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా ఉండగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తప్పుడు చట్టం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పగలరా ? అని అన్నారు.