Leading News Portal in Telugu

Botsa Satyanarayana: సిద్ధం, బై బై పదాలు మావే.. కాపీ కొట్టి వాడుకుంటున్నారు..


Botsa Satyanarayana: సిద్ధం, బై బై పదాలు మావే.. కాపీ కొట్టి వాడుకుంటున్నారు..

Botsa Satyanarayana: సిద్ధం, బై బై పదాలు మావే.. కాపీ కొట్టి వాడుకుంటున్నారు అంటూ విపక్షాలపై ఫైర్‌ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని మోడీతో కూటమి చెప్పిస్తే గాజువాక నుండి అమర్, విశాఖ ఎంపీ పోటీ నుండి బొత్స ఝాన్సీ తప్పుకుంటారని సవాల్‌ చేశారు. చంద్రబాబు మీటింగ్ లలో మాట్లాడే భాష చాలా ఘోరంగా వుంది.. మీ భాషని అదుపులో పెట్టుకోండి.. బజారు మాటలు మాట్లాడకండి.. నోరు జారి మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోకండి.. చంద్రబాబు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు సీఎంగా చెయ్యడం మన దౌర్భాగ్యం.. చంద్రబాబుకి పేదలంటే ఎందుకు అంత కోపం.. ఆన్ గోయింగ్ లో వుండే పథకాలు లబ్దిదారులకు అందకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా అడ్డుకోవడం ఘోరం అంటూ మండిపడ్డారు.


లబ్ధిదారులు అధైర్య పడకండి.. ఎన్నికలు అవ్వగానే మే 14న లబ్ధిదారులకు రావాల్సిన పథకాలు అందుతాయి. చంద్రబాబుకి ఓడిపోతాననే ప్రెస్టేషన్ బాగా పెరిగిపోయి ఏమి చేస్తున్నాడో అర్ధం కావడంలేదని ఫైర్‌ అయ్యారు. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు తానా అంటే తందానా అంటున్నాడు.. కూటమి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేనట్టుగా, మేనిఫెస్టోని అంటరానితనంగా బీజేపీ చూస్తుందన్నారు. చంద్రబాబు కొడుకు పెద్ద శుంట.. ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్, సీఎం జగన్ కోసం మాట్లాడే స్థాయి వుందా..? అని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ మేం చేసిన కార్యక్రమాలని కాపీ కొట్టి అవే చేస్తున్నారు.. సిద్ధం, బై బై పదాలు మావే, ఇవి కాపీ కొట్టి వాళ్లు వాడుకుంటున్నారు.. మా మేనిఫెస్టోని కూడా కాపీ కొట్టారు, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కి సిగ్గుండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దెబ్బకు చంద్రబాబు తన ఒరిజినాలిటీని కోల్పోయి, అన్ని కాపీ చంద్రబాబుగా తయారయ్యాడు అని సెటైర్లు వేశారు. ప్రతి దానిని రాజకీయంగా చూడకండి, పేదలకు జరిగే మంచికి అడ్డుకోకండి అని హితవుపలికారు మంత్రి బొత్స సత్యనారాయణ.