Leading News Portal in Telugu

Botsa Jhansi: స్టీల్ ప్లాంట్‌ ప్రభుత్వం రంగంలో కొనసాగుతుందంటే.. పోటీ నుంచి తప్పుకుంటా..


Botsa Jhansi: స్టీల్ ప్లాంట్‌ ప్రభుత్వం రంగంలో కొనసాగుతుందంటే.. పోటీ నుంచి తప్పుకుంటా..

Botsa Jhansi: వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధాని చెప్తే.. తాను, అమర్‌నాథ్ పోటీ నుంచి తప్పుకుంటామని అన్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్‌లో పోరాటం చేశానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవాలన్న ఆమె.. కూటమికి ఓటు వేస్తే, విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు ఓటు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. కూటమి గెలుపు.. ప్రైవేట్ సంస్థలకు మలుపు అని.. వైసీపీ గెలుపు, స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణకు మలుపు అంటూ ఆమె అన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు.


ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని.. విశాఖలో ఐటీ రంగాన్ని అభివృధ్ధి చేస్తామన్నారు. తనకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కూటమితో జతకట్టినప్పుడే ఓటమి అంగకరించినట్టేనన్నారు. మాకు పదవులు మఖ్యం కాదు.. స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణే ముఖ్యమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాలేదన్నారు.