- విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం..
-
పామును పట్టుకొని అడవిలో వదిలిపెట్టిన స్నేక్ మ్యాన్ కిరణ్..

Snake Enter In Bank: విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం రేపింది. బ్యాంకులో పాము కనిపించడంతో సిబ్బంది, ఖాతాదారులు కలవరపడ్డారు. వదలపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ఇవాళ జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది. సకాలంలో పాము పట్టుకునే కిరణ్ అనే వ్యక్తి బ్యాంకులోని రికార్డు రూమ్ లో ఉన్న పాముతో బయటకు రావడం వీడియోలో కనిపిస్తుంది. ఇక, పామును పట్టుకున్న తర్వాత కిరణ్ దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వదిలి పెట్టాడు. ఆ తర్వాత స్నేక్ మ్యాన్ కిరణ్ కి బ్యాంక్ ఆప్ బరోడా మేనేజర్ ప్రశంసా పత్రం అందజేశారు.
అయితే, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ యొక్క మార్గదర్శకాల ప్రకారం.. పాము పట్టేవారు పాములను వృత్తిగా భావించాలి.. విషపూరిత పాములను పట్టే సమయంలో తగిన సాధనాలు ఉపయోగించి మాత్రమే పట్టుకోవాలని పేర్కొంది. దీంతో పాటు పాములను పట్టే సమయంలో వీడియోలు తీయడం లేదా సందర్శకులతో సన్నిహితంగా ఉండటం వంటివి చేయొద్దాని సూచించింది. కాగా, ఈ వీడియోలో సరైన జాగ్రత్తలు లేకుండా విషపూరితమైన పాములను పట్టుకునే సమయంలో కిరణ్ నిర్లక్ష్యంవహించారని పలువురు నెటిజన్స్ అతడ్ని విమర్శిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్లపూడి బ్రాంచ్ లో పాము కలకలం. బ్యాంకు రికార్డు రూములో చొరబడ్డ పాముని చూసి హడలిన సిబ్బంది. స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారంతో పామును పట్టుకుని ఊరికి దూరంగా వదిలివేత. #AndhraPradesh #TeluguNews #Visakhapatnam #Vizag pic.twitter.com/0aSFRHrOQB
— Vizag News Man (@VizagNewsman) August 14, 2024