- రాబోయే ఐదేళ్లు సీఎం చంద్రబాబుకు పెను సవాల్..
-
అమరావతి.. పోలవరంకు కేంద్రం సహకరిస్తుంది.. -
పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి

Nallari Kiran Kumar Reddy: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లు సీఎం చంద్రబాబుకు పెను సవాల్ అన్నారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన అనుభవం చంద్రబాబుకి కలిసి వచ్చే అంశం.. మాజీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి వ్యక్తిగతంగా సూచనలు ఇస్తాను.. అమరావతి, పోలవరంకు కేంద్రం సహకరిస్తుంది.. గత ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయి అని ఆరోపించారు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి అని కోరారు. ఒడిస్సా, ఛత్తీస్ గఢ్ తో పోలవరంకు ఉన్న అంతరాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవాలి అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక, ఎన్నికల ముందు సినిమాల్లో హిట్స్ లేక పవన్ కళ్యాణ్ స్ట్రగ్లింగ్ స్టార్ గా ఉండే వారు అంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యారు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రూ. 92,000 కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయి.. ఇప్పడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా అంతగా ఏం బాలేదు.. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఎంత భద్రత ఇవ్వాలో న్యాయస్థానమే నిర్ణయిస్తుంది అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.