Leading News Portal in Telugu

Fibernet MD Suspend: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్..


  • అమరావతి: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్..

  • ఫైబర్ నెట్ లో అక్రమాలకు పాల్పడినట్లు మధుసూదన్ రెడ్డిపై ఆరోపణ..

  • ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డిపై అభియోగం..
Fibernet MD Suspend: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్..

Fibernet MD Suspend: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ అయ్యారు. ఫైబర్ నెట్ కార్పోరేషన్ లో తన అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగుల నియామకం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి.

కాగా, ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించిన మధుసూదన్ రెడ్డి.. హెడ్ క్వార్టర్సు విడిచి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ జీవో విడుదల చేసింది. ఇక, ఫైబర్ నెట్ కార్పోరేషనులో రూ. 800 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆంధ్ర ప్రధేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణకు ఆదేశించాలని ఏపీ సర్కార్ యోచిస్తుంది.