Leading News Portal in Telugu

YS Jagan: మాజీ సీఎం జగన్‌కు రాఖీలు కట్టేందుకు పోటీపడిన మహిళలు


  • బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి వైఎస్‌ జగన్‌
  • జగన్మోహన్ రెడ్డికి రాఖీలు కట్టేందుకు పోటీపడిన మహిళలు
YS Jagan: మాజీ సీఎం జగన్‌కు రాఖీలు కట్టేందుకు పోటీపడిన మహిళలు

YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి రాఖీలు కట్టేందుకు మహిళలు పోటీపడ్డారు. చాలా మంది మహిళలు జగనన్న అంటూ ఉత్సాహంతో అరిచారు. అభిమాన నాయకుడికి రాఖీ కట్టే అవకాశం రావడంతో మహిళలు ఆనందంలో మునిగిపోయారు. అనంతరం జగన్మోహన్‌ రెడ్డి గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు.