Leading News Portal in Telugu

Road Accident: తాడిపత్రిలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి


  • అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

  • కారును ఢీకొట్టిన లారీ..

  • కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి..
Road Accident: తాడిపత్రిలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Road Accident: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుండి వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. మృతులు ప్రతాప్ రెడ్డి ( 22), ప్రమీల(21) ఘటనా స్థలంలోనే కన్నుమూయగా.. వెంకటమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.. కాగా, తాడిపత్రి మండలం గన్నెవారిపల్లెకు చెందిన ప్రతాప్ రెడ్డి.. ఓ వివాహం నిమిత్తం తన భార్య ప్రమీల అత్త వెంకటమ్మలతో కలిసి కడపకు బయలుదేరి వెళ్లారు. వివాహం చూసుకున్న తర్వాత తాడిపత్రికి తిరిగి వెళ్తున్న సమయంలో బొందలదిన్నె దాటిన తర్వాత వంగనూరు సమీపంలో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రతాప్ రెడ్డి, ప్రమీలలు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన వెంకటమ్మను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.