- బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటన..
-
రోడ్లు.. డ్రైనేజీ వ్యవస్థ పరిశీలన.. -
2 నెలల వ్యవధిలోనే రోడ్లు పూర్తి చేస్తామని ప్రకటన..

Minister BC Janardhan Reddy: బనగానపల్లెలో అధ్వానంగా ఉన్న రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ దుస్థితిని పరిశీలించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. అయితే, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వాకం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు.. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని హడావుడిగా నాణ్యత లేని పనులు చేశారన్న ఆయన.. 2 నెలల్లో పట్టణంలో ఎక్కడ కూడా రోడ్లలో గుంతలు లేకుండా , డ్రైనేజీల్లో మురికి నీరు నిలువ లేకుండా చేస్తామని ప్రకటించారు.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని పెట్రోల్ బంక్, కరెంట్ ఆఫీస్ ఏరియా, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ ల్లో అద్వాన స్థితిలో ఉన్న గుంతలు పడి ఉన్న రోడ్లను, మురికినీటి తో నిలిచిపోయిన డ్రైనేజీ వ్యవస్థను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు.
అయితే, గత ప్రభుత్వంలో నాణ్యత ప్రమాణాలు లేకుండా చేపట్టిన పనులను లేని ఏ విధంగా అంగీకరించారంటూ ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖ అధికారులను, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. పలు కాలనీల్లో పర్యటించిన అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వాకం వల్ల యాక్సిడెంట్లు జరుగు తున్నాయని విమర్శించారు, ఎన్నికల ముందు బనగానపల్లెకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని హడావుడిగా నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం లేకుండా.. ఇష్టారాజ్యాంగ పనులు చేశారని.. ఆర్భాటాల కోసం రోడ్లు , సెంట్రల్ లైటింగ్ అంటూ ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసేందుకు నాణ్యత లేని పనులు చేశారని మండిపడ్డారు.. అయితే, 2 నెలల వ్యవధిలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను పూర్తి చేస్తామని, పట్టణంలో ఎక్కడ కూడా రోడ్ల లో గుంతలు లేకుండా , డ్రైనేజీ ల్లో మురికి నీరు, నిలువ లేకుండా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. త్వరలోనే రూ.3 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణ పనులు చేపడతామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.