- అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం
- రియాక్టర్ పేలి 18 మందికి పైగా తీవ్ర గాయాలు

Atchutapuram Sez: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సెచ్‌లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 18 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. రియాక్టర్ పేలుడుతో భారీగా మంటలు చెలరేగాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్‌కు, స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల గ్రామాలను పొగలు అలుముకున్నాయి. ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో మంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.