- కడపలో విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి
- మరో విద్యార్థికి తీవ్రగాయాలు

Tragedy: ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళుతున్న ఓ విద్యార్థిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబలించింది. కడప నగరంలోని అగాడి వీధలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతిచెందగా.. మరో విద్యార్థి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యాహ్నం తన్నీవుల్ రెహమాన్(11), అద్నాన్(10) అనే విద్యార్థులు స్కూల్‌కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుండగా.. తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు విద్యార్థులు అక్కడే కుప్పకూలిపోయారు. విద్యుత్ షాక్ వల్ల చెలరేగిన మంటల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా తన్నీవుల్ రెహమాన్ అనే విద్యార్థి మృతి చెందాడు. అద్నాన్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.