Leading News Portal in Telugu

Illegal Layouts: అనధికారిక లేఅవుట్లపై కొరడా.. కఠిన చర్యలకు ఆదేశాలు


  • అనధికారిక లేఅవుట్లపై కొరడా ఝలిపించేందుకు సిద్ధమైన సర్కార్..

  • అనధికారిక లేఅవుట్ల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశాలు..
Illegal Layouts: అనధికారిక లేఅవుట్లపై కొరడా.. కఠిన చర్యలకు ఆదేశాలు

Illegal Layouts: అనధికారిక లేఅవుట్లపై కొరడా ఝలిపించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అనధికారిక లేఅవుట్ల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలోని మున్సిపాల్టీల పరిధిలో అనధికారిక లేఅవుట్ల వివరాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాల్టీల్లో ఉన్న లేఅవుట్లల్లో 50 శాతం మేర అనధికారిక లేఅవుట్లు ఉన్నాయని మున్సిపల్ శాఖ అంచనా వేసింది.. దీంతో.. అవి అనధికారిక లేఅవుట్ల వాటి ముందు బోర్డులు పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు.. ఇప్పటికే వివిధ మున్సిపాల్టీల పరిధిలో అనధికారిక లేఅవుట్ల సమాచారాన్ని ప్రకటనల రూపంలో వెల్లడిస్తోంది మున్సిపల్ శాఖ. అనధికారిక లేఅవుట్లపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామంటున్నారు మున్సిపల్ శాఖ అధికారులు.. మున్సిపాల్టీల్లోని అనధికారిక లేఅవుట్లతో పాటు వివిధ అర్బన్ అథార్టీల్లో వేసిన అనధికారిక లేఅవుట్ల మీద కూడా ఫోకస్‌ పెట్టింది మున్సిపల్ శాఖ.. అర్బన్ అథార్టీల పరిధిలో 50 శాతానికి మించి అనధికారిక లేఅవుట్లు ఉంటాయని మున్సిపల్ శాఖ అంచనా వేసింది.. మొత్తంగా అనధికారిక లేఅవుట్లకు చెక్‌ పెట్టే విధంగా చర్యలకు సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్‌ సర్కార్..