- చంద్రబాబు ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
- కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
- కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

CM Chandrababu: ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో ఇప్పటికే రెండు చార్జి షీట్లు దాఖలు అయినందున కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది.