Leading News Portal in Telugu

Viral Video: తిరుమలలో ఒంటిపై 25 కేజీల నగలు వేసుకొని హల్చల్ చేసిన గోల్డెన్ బాయ్స్..


  • పుణెకు చెందిన భక్తులు తిరుమలలోని వేంకటేశ్వర ఆలయానికి 25 కిలోల బంగారం ధరించి ప్రత్యేక పూజలు.
  • కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి 25 కిలోల బంగారు ఆభరణాలను ప్రదర్శించారు.
  • వీరిని మహారాష్ట్రలో గోల్డెన్ బాయ్స్ గా గుర్తుపడతారు.
Viral Video: తిరుమలలో ఒంటిపై 25 కేజీల నగలు వేసుకొని హల్చల్ చేసిన గోల్డెన్ బాయ్స్..

Viral Video: ఇటీవల పుణెకు చెందిన భక్తులు తిరుమలలోని వేంకటేశ్వర ఆలయానికి 25 కిలోల బంగారం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇకపోతే భక్తులు తమ భక్తిని ప్రదర్శించడానికి బంగారం ధరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆలయ నిర్వాహకులకు, స్థానిక మీడియాకు కేంద్రంగా మారింది. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి 25 కిలోల బంగారు ఆభరణాలను ప్రదర్శించారు.

ఒక వీడియోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారితో సహా కుటుంబ సభ్యులు ఆలయం వెలుపల బంగారు గొలుసులు ధరించి నిలబడి ఉన్నారు. పురుషుల మెడలో పెద్ద చైన్లు, బ్రాండెడ్ సన్ గ్లాసెస్ కూడా కనిపిస్తాయి. ఆ భక్తులు నానా సాహెబ్ వాగ్చొరె, సంజయ్ గుజర్లు. వీరిని మహారాష్ట్రలో సొంత పేర్లతో పిలిస్తే ఎవరూ గుర్తు పట్టారు. గోల్డెన్ బాయ్స్ అంటేనే వీళ్ళను గుర్తుపడతారు. వీరి ఒంటి నిండా కూడా బంగారు నగలే. మెడలో లావుపాటి బంగారు చైన్లను ధరించారు. వారు వీడియోలో మోచేతుల వరకూ బంగారు పట్టీలను ధరించారు.

ఇకపోతే మరోవైపు వాళ్లతో పాటు వచ్చిన మహిళ బంగారుతో చేసిన చీరెను ధరించింది. వీరు ఇదివరకు కూడా హిందీ బిగ్ బాస్ హౌస్‌ లోనూ తళుకుమన్నారు. ఇకపోతే నేడు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వారు మాట్లాడుతూ.. చాలాకాలంగా తాము శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకుంటోన్నామని, ఆ కోరిక నేటితో తీరిందని తెలిపారు.