- ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం
- మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్
- భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
- తిరుపతి జిల్లా ఓజిలిలో ఘటన

Cylinder Blast: తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఓజిలి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. పెద్ద శబ్దం రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో వంటగదిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. స్థానికులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్కూల్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.