- వరద బాధితులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం
- వరద ప్రభావిత గ్రామాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ

Deputy CM Pawan Kalyan: అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో వరద బాధితులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వరద ప్రభావిత గ్రామాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హై పవర్ కమిటీ వేసి అందరికి న్యాయం చేస్తామన్నారు. అందరి సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అందరి బాధలు వింటామని.. వరద బాధితుల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలు స్వీకరించారు. వరద బాధితులను గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా వరద బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు అర్జీలు ఇవ్వడానికి ప్రజలు ఎగబడ్డారు.