Leading News Portal in Telugu

Andhra Pradesh: మారిన మరో 6 పథకాల పేర్లు.. ఇకపై ఇలా..


  • ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారుతున్న పథకాల పేర్లు..

  • ఇప్పటికే మారిన పలు పథకాల పేర్లు..

  • తాజాగా పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న 6 పథకాల పేర్లు మార్పు..

  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్..
Andhra Pradesh: మారిన మరో 6 పథకాల పేర్లు.. ఇకపై ఇలా..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాలకు ఉన్న పేర్లను మారుస్తూ వస్తోంది.. ఇప్పటికే పలు పథకాల పేర్లు మారిపోగా.. తాజాగా.. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న ఆరు పథకాల పేర్లలో మార్పులు.. చేర్పులు చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. 1. అమ్మఒడి పథకానికి తల్లికి వందనంగా పేరు మార్పు చేసిన ప్రభుత్వం. 2. విద్యా కానుక పథకానికి సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్ధి మిత్రగా పేరు మార్చింది.. 3. గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. 4. పాఠశాలల్లో నాడు -నేడు కార్యక్రమానికి మన బడి – మన భవిష్యత్ పేరిట కొత్త పేరు పెట్టారు.. 5. స్వేచ్చ పథకానికి బాలికా రక్షగా పేరు మార్పు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.. 6. జగనన్న అణిముత్యాలు పథకానికి అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం కింద పేరు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా కొన్ని పథకాల పేర్లు మారుస్తూ రాగా.. తాజాగా మరో ఆరు పథకాలు ఆ జాబితాలో చేరాయి.