Leading News Portal in Telugu

Blast in Firework Factory: ఏపీలో మరో ప్రమాదం.. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి


  • చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం..

  • గంగవరం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..

  • భార్య.. భర్తలు మృతి.. కుమారుడి పరిస్థితి విషమం..
Blast in Firework Factory: ఏపీలో మరో ప్రమాదం.. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి

Blast in Firework Factory: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి.. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ ప్రమాద ఘటన మరువక ముందే.. మరో కంపెనీలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. గంగవరం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో భార్య, భర్తలు ఇద్దరూ మృతిచెందారు.. తీవ్రగాయాలపాలైన కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ భాషాతో పాటు ఆయన భార్య షాహినా ప్రాణాలు విడిచారు.. మరోవైపు.. బాణాసంచా అమ్మకాల లైసెన్స్ తో ఏకంగా బాణాసంచా తయారు కేంద్రం నడుపుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు.. ఇక, పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.. తయారీ కోసం తెప్పించుకున్న నల్లమందే పేలుడికి కారణమా అనే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..