- ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన..
- మద్యం మత్తులో దారుణం.
- భర్త మర్మాంగాన్ని కోసిన భార్య..

Private Part Cut: ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టే వేధింపులకు విసుగు చెందిన అతని రెండో భార్య భర్త మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ భర్తని ఒంగోలు నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
బీహార్ రాష్ట్రానికి కి చెందిన విజయ్ యాదవ్ గతకొద్ది కాలంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో ఓ పశువుల డైరీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇకపోతే అదే డైరీ ఫామ్ లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన సీతా కుమారి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇకపోతే విజయ్ యాదవ్ ఇదివరకే వివాహం చేసుకొని ఉన్నాడు. అతడి భార్యని బీహార్ లోని సొంత ఊరిలోనే ఉంచేశాడు. ఇక్కడ సీతతో వివాహేతర సంబంధం కొనసాగించి చివరికి రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ గర్భవతి కావడంతో.. విజయ్ ఆమెను పట్టించుకోవడం లేదన్న కారణంగా తరచూ అతనితో భార్య గొడవపడేది.
ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి సమయంలో మద్యం తాగి వచ్చిన విజయ్ యాదవ్ కు సీతాకుమారికి మద్య గొడవ జరిగింది. దీంతో రెండో భార్య సహనం కోల్పోయి కత్తితో భర్త పై దాడి చేసింది. ఈ దాడిలో భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ భర్తని చూసి భయంతో తన డైరీ ఫార్మ్ యాజమానికి అసలు విషయాన్ని ఫోన్ చేసి తెలిపింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆవిడ పరారైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేబడుతున్నారు. పరారీలో ఉన్న భార్య సీతా కుమారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.