Pilli Subhash Chandra Bose: వైసీపీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదు.. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్‌తోనే!
- వైసీపీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదు
- రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్ జగన్‌తోనే ఉంటా
- పార్టీ మార్పు వార్తలపై స్పందించిన పిల్లి సుభాష్ చంద్రబోస్

Pilli Subhash Chandra Bose: గత కొద్ది రోజులుగ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంపీ సుభాష్ చంద్రబోస్ స్పందించారు. వైసీపీ పిల్లర్లలో తాను ఒకడినని.. అలాంటి తాను వైసీపీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం ముందు నుంచే జగన్‌తోనే ఉన్నానని చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్ జగన్‌తోనే ఉంటానని చెప్పారు. ఇంతకు ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ తనను ఎంతో ప్రోత్సహించారన్నారు. వైఎస్ జగన్ తనకు ఎటువంటి అన్యాయం చేయలేదన్నారు. అలాంటి జగన్‌కు తాను వెన్నుపోటు పొడవలేనని చెప్పుకొచ్చారు. వైసీపీ తనను ఎంతగాన ఆదరించన్నారు. పార్టీలు మారితే రాజకీయాలలో విలువలు తగ్గిపోతాయ్నారు. తాను రాజీనామా చేస్తే మళ్లీ ఆ పదవి వైసీపీకి దక్కే అవకాశం లేదని.. అలాంటప్పుడు అది నైతికత ఎలా అవుతుందని ప్రశ్నించారు.