Leading News Portal in Telugu

Hidden Camera at Ladies Washroom Incident: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై సీఎం సీరియస్‌.. విచారణకు ఆదేశాలు


  • గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం..

  • లేడీస్ లాయిలెట్స్ లో రహస్య కెమెరాలు..

  • ఆందోళనకు దిగిన విద్యార్థినులు..

  • ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్..

  • విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు..

  • కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన మంత్రి లోకేష్..
Hidden Camera at Ladies Washroom Incident: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై సీఎం సీరియస్‌.. విచారణకు ఆదేశాలు

Hidden Camera at Ladies Washroom Incident: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికల టాయిలెట్స్‌లో విద్యార్థులు రహస్య కెమెరాను కనుగొన్నారు. కొందరు దుండగులు మహిళల టాయిలెట్స్‌లో రహస్యంగా కెమెరాలు అమర్చారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఘటనపై వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే యాజమాన్యం స్పందించక పోవడంతో పాటు నిందితుడిని వెంటనే శిక్షించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం వెంటనే స్పందించి ఇలాంటి దారుణ ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం యూనివర్శిటీ క్యాంపస్‌ లో మాకు న్యాయం కావాలి అని నినాదాలు చేసారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యూనివర్సిటీ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. దీంతో మీడియాకు సమాచారం రాకుండా యూనివర్సిటీ గేట్లను మూసివేశారు.

అయితే, గుడ్లవల్లేరులో హిడెన్ కెమెరాల వ్యవహరంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయ్యారు.. హిడెన్ కెమెరాల ఫిక్స్ చేశారనే ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.. ఇక, ఈ ఘటనపై ఆరా తీశారు మంత్రి నారా లోకేష్.. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు జరిపిస్తాం అన్నారు.. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు.. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. కళాశాలల్లో ర్యాగింగ్ వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌..

కాగా, రాత్రి గుడ్లవల్లేరులోని ఆ ఇంజినీరింగ్‌ కాలేజీలో.. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ.. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు.. విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్ కు చేరుకున్నారు పోలీసులు. ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెల్లవారుజామున 3.30 గంటల వరకు కొనసాగిదింది హైడ్రామా. ఈ ఘటనలో ఫైనల్ ఇయర్ విద్యార్థికు, మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికల హాస్టల్ ల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ. ‘ ఎక్స్ ‘ వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు విద్యార్థులు. వారం రోజులుగా ఇంత జరుగుతున్న చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ను విద్యార్థినిలు ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించడంతో.. విచారణలో ఏం బయటకు వస్తుందో చూడాలి..