Leading News Portal in Telugu

Employees Transfers: ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు.. మరో 15 రోజులు అవకాశం..


  • ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో అవకాశం..

  • 15 రోజుల గడువు పొడిగించిన ప్రభుత్వం..

  • వచ్చే నెల 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత..

  • 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ జీవో..
Employees Transfers: ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు.. మరో 15 రోజులు అవకాశం..

Employees Transfers: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో 15 రోజుల గడువు పొడిగించింది.. వచ్చే నెల (సెప్టెంబర్‌) 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది.. అయితే, వచ్చే నెల 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. కానీ, ఇప్పటికీ బదిలీల విధివిధానాలను మెజార్టీ శాఖలు రూపొందించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, రవాణ శాఖల బదిలీల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయట.. విధి విధానాల రూపకల్పలోనే వివిధ శాఖలు ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు ఉద్యోగులు.. వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ఆఫీసర్‌ బేరర్స్ లెటర్స్ సంపాదించి.. బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఉద్యోగ సంఘాలకు వార్నింగ్‌ ఇచ్చిన విషయం విదితమే.. తప్పుడు మార్గంలో ఉద్యోగులకు ఆఫీసర్‌ బేరర్స్‌.. ఇతర పోస్టుల్లో ఉన్నట్టు లెటర్స్‌ ఇవ్వొద్దని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.