Leading News Portal in Telugu

Andhra Pradesh: జీఏడీ స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ నియామకం


Andhra Pradesh: జీఏడీ స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ నియామకం

Andhra Pradesh: ఏపీ సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ నియామకమయ్యారు. దాదాపు రెండు నెలల నుంచి రజత్ భార్గవకు పోస్టింగ్ దక్కకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. రజత్ భార్గవ నేడు రిటైర్‌ కానున్నారు. ఎలాంటి పోస్టింగ్ లేకుండా రిటైరయ్యేలా చేయడం సరి కాదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. గతంలో పూనం మాల కొండయ్యకు ఇదే తరహాలో సర్వీస్ చివరి రోజున ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అదే తరహాలో రజత్ భార్గవకు పోస్టింగ్ ఇవ్వడం విశేషం.