- సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు..
-
భారీ వర్షాల నేపథ్యంలో ఓర్వకల్ పర్యటన రద్దు చేసుకున్న సీఎం..

CM Chandrababu Tour Canceled: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఈ రోజు కర్నూలు జిల్లా ఓర్వకల్ లో చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. వాతావరణంలో మార్పులు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆ టూర్‌ను క్యాన్సిల్ చేశారు.. ఇక, ముందు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు చేశారు అధికారులు.. అయితే, ఆ తర్వాత రద్దు చేసి ఓర్వకల్ లో పర్యటన ఖరారు చేశారు. ఇప్పుడు వర్షం కారణంగా ఓర్వకల్ పర్యటన కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామునే పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయ్యింది.. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో ఈ పెన్షన్ల పంపిణీలో పాల్గొనాల్సి ఉంది.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ పర్యటన రద్దు అయ్యింది. అయితే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రతీ నెల 4 వేల రూపాయల చొప్పున పెన్షన్లు పంపిణీ చేస్తోంది.. ఇక, సీఎం చంద్రబాబు.. ప్రతీ నెల పెన్షన్ల పంపిణీలో పాల్గొంటోన్న విషయం విదితమే.. మరోవైపు.. ఈ నెల ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే.